కలెక్షన్ కింగ్ కనబడుట లేదు.. ఔనా.. నిజమా?

Mohan Babu

అరిస్తే కరుస్తా.. కరిస్తే చరుస్తా.. ఏదీ కుదరకపోతే పారిపోతా! అబ్బా డైలాగ్ అదిరింది కదూ. ఏ సినిమాలోదో అర్ధ అయిపోయిందా. ఏయ్.. మీరు సూపర్. నిజంగా మంచు మనసున్న కలెక్షన్ కింగ్ నటించిన జర్నలిస్ట్ తోలు తీస్తా సినిమాలో డైలాగ్ ఇది. ఇంటి పరువు రచ్చ కీడ్చుకుని.. కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్ట్ ని మైక్ తో చావ బాది.. పోలీసులు కేసు పెడితే కోర్టుల చుట్టూ తిరిగి.. కోర్టులు కాదనే వరకూ పోలీసులతో దాగుడుమూతలు ఆడి.. ఆ ఆ తరువాత కనిపించకుండా పోయిన హీరోగారు ఇప్పుడు ఇంటర్వెల్ కార్డు పడింది. మరి సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ లు ఉంటాయా? ఉంటె ఎలా ఉండొచ్చు? A. అబ్బే కేసూ లేదు.. గీసు లేదు బాధితుడు కేసు విత్ డ్రా చేసుకుంటాడు B. నిందితుడు కోర్టులో లొంగిపోయి.. ఆపైన జైలుకు వెళ్ళేలోపు బెయిల్ తెచ్చుకుని.. మరి కొన్నాళ్ల పాటు జైలు.. బెయిలు ఆట ఆడుకుంటాడు C. హీరోగారు ఆ సమయంలో వయసు రీత్యా మతి మందగించడంతో అలా ప్రవర్తించారు.. అని డాక్టర్ సర్టిఫికెట్ తెచ్చుకుని, కేసు కొట్టేయాల్సిందిగా కోర్టును బతిమాలుకొని.. మరో కుటుంబ కథా వయలెంట్ సినిమాకి స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాడు(ఈసారి దర్శకత్వం కూడా హీరో గారిదే) ఛస్ ఇవేం కాదు.. ఇప్పటికే మీడియాకి కొత్త వార్తలు బోలెడు వచ్చాయి.. వాటి చుట్టూ మైకులు పరుగులు తీస్తున్నాయి. ఈ డోకు పాత హీరో కథని పట్టించుకునే తీరిక లేదు. అందుకని సినిమా పూర్తి అయిపోయినట్టే అంటారా? అది మీ ఇష్టం. ఎందుకంటే, సెలబ్రిటీల కథలు కంచికి చేరవు అనేది మనకు తెలిసిందే కదా. శ్రీదేవి మరణం నుంచి డ్రగ్స్ కేసుల వరకూ ఎన్ని సినిమాలు చూడలేదేంటీ!

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page