ఓరి దేవ..రా !

Devara Review

ఓహో ‘దేవర’ సినిమా! ఈ సినిమా చూడడం కోసం ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్న వారి గుండెలు పగిలిపోయి ఉంటాయి.. పాపం. వాళ్లంతా ఎదో అద్భుతం చూడబోతున్నాం అనుకుని ఉండొచ్చు కానీ.. ఫలితం మరోలా ఉంది!

కథ: కథ 1996 నుంచి స్టార్ట్ అయిందట… కానీ వేరే ఏ టైంలో స్టార్ట్ అయినా ఒరిగేదేమీ లేదు. పోలీస్ ఆఫీసర్ ఒక క్రిమినల్‌ని పట్టుకోవాలని వెంబడిస్తుండగా కథ మొదలవుతుంది. ఆ క్రిమినల్ ఎవరో, ఎర్రసముద్రం ఏంటో, అది కథ చెప్పిన వాళ్లకయినా  అర్ధం అయ్యే అవకాశం ఉందోలేదో కానీ, జనాలకి మాత్రం అర్థం కాలేదట.  ఆ ఎర్ర సముద్రం కోసం 70లలోకి  వెళ్ళిపోతారు. ఇదంతా టైం ట్రావెల్ అనుకుంటే మీరు ‘వజ్రం’ సినిమా టైమ్ మిషన్ లా పొరపాటు పడతారు. *పిరేట్లు, షిప్పులు… కానీ అవే సరైన పని చేయలేకపోతుంటే, దీని నుంచి ఇంకేం ఆశించాలి? ఎందుకంటే, మొదట్నుంచి ఇవే సినిమాకి హైలైట్ అంటూ హైప్ చేశారు. 

పర్ఫార్మెన్స్: NTR గారు రెండు షేడ్స్ లో కనిపిస్తారు అంట… కానీ షేడ్స్ లో నటిస్తారో, సన్ గ్లాసెస్ లో నటిస్తారో అర్థం కానీ కన్‌ఫ్యూజన్ ప్రేక్షకులను ముంచేస్తుంది. కథ ఎంతో డీప్ గా ఉంటుందో అని అనుకుంటే, ఆ డెప్త్ ఎక్కడుందో వెతకాల్సిన పరిస్థితి. అయినా, ఈ మధ్య మన సినిమాలకు డెప్త్ ఉన్న కథ ఆశించడం తప్పేమో కదా! హీరోగారు సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు.. అనుకోవడానికి ఆయన ఒకే ఒక్క ఎమోషన్ తో ఫిల్మ్ పూర్తిచేసారు అని నమ్మొచ్చు.

జాన్వి కపూర్ గారు తమ తొలి తెలుగు చిత్రంలో కనిపించారు… పాపం! ఐనా, మీరు చూడ్డానికి ఓపిక ఉంటే, కచ్చితంగా చూసి తీరాల్సిందే. పాత్రలో ఆమె ఉంటే చాలు, కథకు అవసరం లేదని డైరెక్టర్ గారు గట్టిగా అనుకున్నారనుకుంటా.. . ఆమె స్క్రీన్ మీద ఉన్నప్పుడు హీరో పక్కన నిలబడటం మినహా మరేం చేయలేదు. ఇంకా చెప్పాలంటే అవకాశం కూడా డైరెక్టర్ ఇవ్వలేదు. 

సైఫ్ అలీ ఖాన్ గారిని పెట్టడమే హైలైట్ అని చెప్పొచ్చు… ఎందుకంటే ఆయన పాత్ర లైట్ గానే ఉంది. విలన్ అయినా, కథ లో అంతకంటే స్ట్రాంగ్ క్యారెక్టర్లు ఉంటే బాగుండేది అని ప్రేక్షకులంతా అనుకున్నారు.

టెక్నికల్ ఎక్సలెన్స్: గ్రాఫిక్స్ గురించి చెప్పాలంటే, అవతార్ సినిమాలో గాలిలో ఎగిరిపోవడమే  టెక్నికల్ విభాగమైతే, ఇక్కడ గాలిని పట్టుకునే గ్రాఫిక్స్ గురించి మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. CGI చూడడానికి తప్ప చెప్పుకోవడానికి ఏమీ  లేని ఫీల్ వచ్చింది. ఇంకో ప్రాబ్లెం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లో. అది మూడ్ ఎలివేట్ చేస్తుందని అన్నారు… కానీ ఎలివేట్ కాదు.. ఫ్లోర్ ఎత్తిపడేసినట్టు అ నిపించింది. పాటలు అయితే రామాయణంలో వానరసేన ఆడించినట్లు వున్నాయి. ఒక్క పాట మినహా, మిగతావి ఎందుకు పెట్టారో ప్రేక్షకులు ఇంకా ఆలోచిస్తున్నారట.

క్లైమాక్స్: సినిమాకు క్లైమాక్స్ ఉందా? ఉండొచ్చు కానీ, అది ప్రేక్షకులకు ఉందొ లేదో తెలీలేదంట.  చుట్టమల్లే పాటలా, ఒక్కసారి చూశాక దానిని మర్చిపోవచ్చు.

ఫైనల్ వర్డిక్ట్: ‘దేవర’ సినిమా ఒక ఇంట్లో చేసిన పానీ పూరి లాంటిది… చూడటానికి చాలా ఆకర్షణగా ఉంటుంది. కానీ ఒక్కసారిగా తింటే, ఇంకెప్పటికీ తినొద్దనిపిస్తుందంటే  మీరు అర్థం చేసుకోవచ్చు. అదే, ఈ సినిమా చూడడం కోసం నమ్మకాలు పెట్టుకోకండి.. ఆ నమ్మకం వేరే సినిమా కోసం దాచుకోండి!”

గాలివార్తలు రేటింగ్ :  13/5

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page