మన రాహుల్ గాంధీగారి యూఎస్ టూర్ గురించి చెప్పుకోవాలంటే, ‘స్పీచ్ వింటారా’ అని ఆయన అడిగితే, జనం “సెల్ఫీ దిగుతా!” అని రిప్లై ఇస్తున్న పరిస్థితి. పాపం వేదిక మీద రాహుల్ గారు ఎంతో శ్రద్ధగా మాట్లాడుతుంటే, ఫ్లోర్ మీద ఉన్న వాళ్ళ దృష్టి మాత్రం, “ఓ ఫోటో దిగడమే ముఖ్యం!” అన్నట్టుగా ఉంది. జనాలు రాహుల్ సారు మాటలు వినడానికి కాదు, ఫోటో దిగడానికే ఎక్కువ హాజరు అయ్యారు అని చెప్పుకోవడంలో ఏ మాత్రం ఎవ్వరికీ డౌట్ అక్కర్లేదు. వాట్సాప్ డీపీలో గాంధీగారితో సెల్ఫీ ఉంటే – అదేనండీ లైఫ్ సెట్! ఆయన స్పీచ్ తర్వాత ఎక్కడో చోట వినొచ్చనుకుంటున్నారేమో?
ఇక రాహుల్ గారు అటు, యూఎస్‌లో ఖాళీ కుర్చీలతో కష్టాల్లో ఉండగా, తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ భారీ జనసందోహాలు సృష్టించడంలో నెంబర్ వన్. మన రాహుల్ గారు కూడా ఈ గేమ్ గ్రహించేసి, “క్రౌడ్ మేనేజ్మెంట్ సీక్రెట్స్ మీరే చెప్పాలి, రేవంత్!” అంటూ వాట్సాప్‌లో పర్సనల్ కాల్ ప్లాన్ చేసుకున్నారట. ఎందుకంటే, ఇలాంటి “ఎన్‌క్రిప్టెడ్ సీక్రెట్స్” అందరూ వినకూడదు కదా!
సో, రేవంత్ గారి టిప్స్ రాహుల్ గారికి ఎప్పుడు అందుతాయో చూడాలి. ఆ టైమ్ వచ్చినాక, రాహుల్ గాంధీ నెక్స్ట్ టూర్‌లో ఖాళీ హాల్స్ మాటేమిటి, సిట్టింగ్ ప్లేస్ కూడా దొరకదు! కానీ ఇప్పటివరకు, టూర్ హిట్టు కాకపోయినా కాని ఫోటో సెలబ్రిటీగా మాత్రం రాహుల్ కచ్చితంగా సెట్ అయిపోయారు. మొత్తం ఫలితం: స్టేజీపై స్పీచ్ కాదు, వాట్సాప్ గ్రూపుల్లో మాత్రం ‘రాహుల్ సెల్ఫీ’ డిజాస్టర్ లా ట్రెండ్ అయ్యింది!